చికిత్స పొందుతూ యువకుడి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం రామునిపల్లికి చెందిన మడతనపల్లి చరణ్(29) చికిత్స పొందు తూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చరణ్ హైదరాబాద్‌లో ఎంసీఏ చది వాడు. జాబ్ రాలేదు. గతనెల సమ్మక్క జాతర కోసం ఇంటికి వచ్చాడు. ఉద్యోగం రాలేదని తండ్రితో బాధపడితే, మనకు కొంత పొలం ఉంది అని ధైర్యం చెప్పాడు. ఈనెల 5న కొడుకును తీసుకుని తండ్రి పొలం వద్దకు వెళ్లి చూపెట్టడంతోపాటు గడ్డిమందు చల్లారు. మి గిలిన మందు పొలం వద్దే ఉంచారు. మరుసటి రోజు చరణ్ పొలం వద్దకు వెళ్లి ఆ మందు తా గి తన సోదరి కుమార్తెకు ఫోన్ చేసి చె ప్పాడు. వెంటనే తండ్రి సుధాకర్‌కు చెప్పడంతో అ తను పొలం వద్దకు వెళ్లి చూడగా చరణ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, అక్కడి నుంచి హైదారాబాద్ తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందా డు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు.


