ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక | - | Sakshi
Sakshi News home page

ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక

Feb 12 2026 10:21 AM | Updated on Feb 12 2026 10:21 AM

ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక

ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక

ఆదర్శంగా మారిన యువ ఇంజినీర్‌ జయాకర్‌ రాజు

కోల్‌సిటీ(రామగుండం): కర్నాటక రాష్ట్రంలో పనిచేస్తున్న ఓ యువ ఇంజినీర్‌ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించడానికి రెండురోజులు సెలవుపెట్టి తన ఇంటికి వచ్చాడు. గోదావరిఖని రమేశ్‌నగర్‌కు చెందిన జయాకర్‌రాజు కర్నాటక రాష్ట్రంలోని స్టాల్‌ప్లాంట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ దినపత్రికలు చదవడం అలవాటు ఉన్న జయాకర్‌రాజుకు రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికలు ఉన్నాయని తెసింది. గోదావరిఖనిలోని తన మిత్రుల ద్వారా ఎన్నికల వివరాలు సేకరించాడు. ఓటుహక్కును ఎన్నికల్లో వినియోగించుకోవడానికి గోదావరిఖనికి వచ్చాడు. బుధవారం జవహార్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటువేశాడు. తనవంతు బాధ్యత నిర్వర్తించాని తెలిపాడు. ఎక్కడ పనిచేస్తున్నామన్నది ముఖ్యం కాదని, మన ప్రాంత అభివృద్ధికి మన ఓటు ఎంతో కీలకమన్నారు.

ఓటు వేసిన జయాకర్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement