● అభ్యర్థుల నివాసాల్లో సందడి | - | Sakshi
Sakshi News home page

● అభ్యర్థుల నివాసాల్లో సందడి

Feb 13 2026 3:49 AM | Updated on Feb 13 2026 3:49 AM

● అభ్యర్థుల నివాసాల్లో సందడి

● అభ్యర్థుల నివాసాల్లో సందడి

● అభ్యర్థుల నివాసాల్లో సందడి

కరీంనగర్‌టౌన్‌: మరికొన్ని గంటల్లో కార్పొరేషన్‌ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల నివాసాల్లో ముందురోజు నుంచే సందడి నెలకొంది. నగరంలో 3,40,580 మంది ఓటర్లు ఉండగా 2,14,486 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 62.98శాతం ఓటింగ్‌ నమోదు కావడంతో గెలుపోటములను అభ్యర్థులు అంచనా వేయలేకపోతున్నారు. అనుచరులతో బూత్‌లవారీగా లెక్కలు కడుతూ మల్లగుల్లాలు పడుతున్నారు. కులాలు, మతాల ఓట్లను లెక్కిస్తూ తమకు ఇన్ని వస్తాయంటూ ఆశతో ఉన్నారు. ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచే అనుచరులను తమ ఇండ్లకు పిలుచుకుని పోలైన ఓట్లు, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనే అంచనాల్లో మునిగితేలుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్లలో కార్యకర్తల సందడి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement