ఘనంగా కేసీఆర్ బర్త్‌డే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డే మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో 72 కేజీల భారీ కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా పూలు, పండ్ల మొక్కలను పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు గుగ్గిళ్ల జయశ్రీ, వాల రమణరావు, కంసాల శ్రీనివాస్, చిట్టీ రాజేందర్‌రావు, సంపత్‌రావు, నాయిం, రేణుక, సూర్యశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్‌టౌన్


