కెనాల్ మరమ్మతుకు నిధులు
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని బొమ్మనపల్లి గ్రామ ఎల్లమ్మ ఆల యం వద్ద ఎంఎంఆర్ కెనాల్ మరమ్మతు పనులను సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈనెల 15న ‘సాక్షి’లో ‘ఏటా గండి ..తాత్కాలిక మరమ్మత్తులతో సరి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. మండలంలోని పీచుపల్లి కెనాల్ నుంచి రేకొండ, బొమ్మనపల్లి మీదుగా సైదాపూర్ మండలం బొమ్మకల్ వరకు 38 చోట్ల అదనపు స్ట్రక్షర్ల నిర్మాణానికి రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మంత్రికి అధికారులు వివరించారు. ఈసందర్భంగా కెనాల్ మరమ్మతుకు నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణమే కాలువ మరమ్మతు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, సర్పంచ్‌లు కొంకట మౌనికచక్రధర్, అల్లేపు సంపత్, ఇరిగేషన్ ఏఈఈ రాజు పాల్గొన్నారు.
కెనాల్ మరమ్మతుకు నిధులు


