యూరియా కోసం ఆందోళన
శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మొలంగూర్ గోదాంలో 450 బస్తాల యూరియా ఉండగా రైతులు గోదాం వద్దకు వచ్చారు. మొబైల్‌యాప్‌లో బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా దొరకగా.. స్మార్ట్‌ఫోన్లలో సాంకేతిక సమస్య తెలియని రైతులకు యూరియా దొరకపోవడంతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పదిరోజులుగా తిరుగుతున్నా ఒక్కబస్తా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏవో వెంకటేశ్ మొలంగూర్‌కు చేరుకుని ఆన్‌లైన్‌లో రైతుల మొబైల్‌నంబర్లు లింక్ చేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.


