ప్రపంచాన్ని నడిపేది ప్రేమ తత్వమే
కరీంనగర్‌కల్చరల్: ప్రపంచాన్ని నడిపేది ప్రేమ తత్వమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవా ర్డు గ్రహీత సాదనాల వెంకటస్వామి నాయుడు అన్నారు. కవి కసిరెడ్డి జలంధర్‌రెడ్డి రచించిన ప్రేమ రాగాలు పుస్తకాన్ని కరీంనగర్‌లోని గణాంకభవన్‌లో భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. విశిష్ట అతి థిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల లక్సెట్టిపేట సహాయ ఆచార్యుడు తన్నీరు సురేశ్ మాట్లాడుతూ.. ప్రేమ రాగాలు కవితలు గోదావరి నదిలా ప్రవహించాయని, కవిత్వంలో భావాలు అందరి జీవితాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. తెరవే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకట్ల తిరుపతి మాట్లాడుతూ ప్రేమ మానసికమైనదని, ప్రేమ లేని జీవితాలు ఉండవన్నారు. వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవులు ఎల్గటి తిరుపతిరెడ్డి, అన్నాడి గజేందర్‌రెడ్డి, దామరకుంట శంకరయ్య, అన్నవరం దేవేందర్, జి.కాళిదాసు, నాగమల్ల పున్నంచందర్, పెంచాల రంగా రావు, బొమ్మకంటి కిషన్, సింగిరెడ్డి రాజిరెడ్డి, గుండు రమణయ్య పాల్గొన్నారు.
విద్యార్థుల కోసం ఉద్యమించేది ఏఐఎస్‌ఎఫ్
కరీంనగర్‌టౌన్: విద్యార్థుల సమస్యలపై ఉద్యమిస్తున్న ఏకై క విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ అని, ఫిబ్రవరి 18 నుంచి 20వరకు నిజామాబాద్‌లో జరిగే ఏఐఎస్‌ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో శనివారం ఏఐఎస్‌ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు నిజామాబాద్‌లో జరిగే ఏఐఎస్‌ఎఫ్ నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయ క్, నగర ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, శ్రావణ్, నవీన్ పాల్గొన్నారు.
బిల్లును వ్యతిరేకించండి
కరీంనగర్‌టౌన్: ఫెడరల్ విధానానికి వ్యతిరేకంగా విద్యారంగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకువచ్చే వికసిత భారత్ శిక్ష అభియాన్ బి ల్లును వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహా ప్రధాన కార్యదర్శి ముస్కుల రఘుశంకర్ రెడ్డి అన్నారు. శనివా రం టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అవా లు నరహరి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబు ల్ సమావేశంలో మాట్లాడారు. విద్యారంగానికి నిధులు కేటాయించకుండా కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేసే విధంగా ప్రవేట్ యూని వర్సిటీలను ఆహ్వానిస్తూ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లేని విద్యా విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. పాఠ్యాంశాలలో సైంటిఫిక్ భావజాలాన్ని తగ్గిస్తూ, శాసీ్త్రయమైన అంశాలను పాఠ్యాంశాలలో చెప్పిస్తూ, ప్రజలను మధ్యయుగంలోకి తీసుకెళ్లే విధంగా విద్యా విధానాన్ని రూపొందిస్తుందన్నారు. ఇది సరైన విధానం కాదని దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు. టీస్‌ఈసీ బాధ్యులు వేల్పుల రత్నం, ఆంజనేయరావు, రామ లింగారెడ్డి, ఏసురెడ్డి, జెల్ అసోసియేషన్ బాధ్యులు సుధాకర్, శ్రీనివాస్, తిరుమలయ్య, టీపీటీఫ్ బాధ్యులు రామచంద్ర రెడ్డి, శ్రీనివాస్, డీటీఫ్ బాధ్యులు చకినాల రామ్మోహన్, తూముల తిరుపతి పాల్గొన్నారు.
మేయర్ ఎన్నికల అధికారిగా మహేశ్వర్
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో పూర్తి చేస్తారు.
ప్రపంచాన్ని నడిపేది ప్రేమ తత్వమే
ప్రపంచాన్ని నడిపేది ప్రేమ తత్వమే


