బీజేపీ వల్లే ఆకాశానికి బంగారం, వెండి ధరలు
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లే బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు పెట్టే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని కట్టరాంపూర్‌లో 10,11వ డివిజన్‌ల అభ్యర్థులు ఆకుల నర్మద, కొడూరి రవీందర్‌గౌడ్‌లకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. కాగా ప్రచారం గడువు ముగుస్తున్న తరుణంలో వచ్చిన శ్రీధర్‌బాబు, సరిగ్గా సాయంత్రం 5 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.


