కదం తొక్కిన కార్మికులు
కరీంనగర్‌టౌన్: నాలుగు లేబర్ కోడ్లు, బీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్, విత్తన బిల్లులు ఉపసంహరించాలని నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో గురువారం విజయవంతమైంది. నగరంలోని గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పీఎఫ్ కార్యాలయం రోడ్డులో సభ నిర్వహించారు. సీఐ టీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌వీ.రమ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమట్ల సమ్మయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడారు. కార్మిక, కర్షకుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని తరిమికొట్టాలన్నారు. నాయకులు జనగాం రాజమల్లు, పున్నం రవి, కాళిదాసు, కాశెట్టి లక్ష్మయ్య, దాసరి ప్రభాకర్, రాజేందర్, సంపత్ యాదవ్, రాజు, వీరయ్య, పోశయ్య, కిరణ్, ఆగయ్య, బి.అశోక్, పొనగంటి కేదారి, రాయకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులు విధులు నిలిపివేసి ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.


