కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీలు రాష్ట్రవ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని రగిలించాయి. యువతలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన వేలాది మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, జూడో, వుషూ, స్విమ్మింగ్, కిక్ బాక్సింగ్, తైక్వాండో, కరాటే తదితర క్రీడల్లో యువ క్రీడాకారులు పతకాలు సాధించి ఆయా జిల్లాలకు గౌరవం తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పట్టుదలతో పోటీ పడుతూ బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. సరైన శిక్షణ, అవకాశాలు లభిస్తే గ్రామీణ యువత కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఈ విజయాలు నిరూపించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాధించిన పతకాలు కేవలం విజయాల సంఖ్య కాదు.. అది గ్రామీణ యువత సంకల్పానికి ప్రతీక. సీఎం కప్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రతిభ రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, దేశానికి మరింత కీర్తి తేవాలని ఆశిద్దాం. ఈ సందర్బంగా సాక్షి ప్రత్యేక కథనం.
జిమ్నాస్టిక్స్ రాష్ట్ర పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు ప్రదానం
సీఎం కప్ పోటీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు ఆతిథ్యమిచ్చి ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచింది. తొలి సీఎం కప్‌లో జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించిన జిల్లా క్రీడాశాఖ సెకండ్ ఎడిషనలో జిమ్నాస్టిక్స్ పోటీలను ఘనంగా నిర్వహించి శభాష్ అనిపించుకుంది. ఈ పోటీలకు 18 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరు కాగా.. సుమారు 70కి పైగా పతకాల పోరు సాగింది.
పసిడి పతకాలతో మెరిసిన క్రీడాకారులు 53 పతకాలతో కరీంనగర్ హవా
మెరుగైన పతకాలు సాధించిన పెద్దపల్లి, జగిత్యాల 2 పతకాలతో సరిపెట్టుకున్న రాజన్న సిరిసిల్ల


