యూరో కప్-2024 విజేత స్పెయిన్‌కు ఆపూర్వ స్వాగతం లభించింది. ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న స్పెయిన్ జట్టుకు అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తమ సొంత గడ్డపై అడుగుపెట్టిన స్పెయిన్ జట్టు.. తొలుత ఆ దేశ రాజు ఫెలిపే VI, అతని కుటుంబాన్ని కలిశారు.
ఆ తర్వాత రాజధాని మాడ్రిడ్‌లో ఓపెన్-టాప్ బస్ పరేడ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు పాల్గోనున్నారు. తమ ఆరాధ్య జట్టుకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మాడ్రిడ్‌లోని సిబిలెస్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు.
అభిమానుల కేరింతల మధ్య స్పెయిన్ జట్టు బస్ విక్టరీ పరేడ్ జరిగింది. స్పెయిన్ ఆటగాళ్లు ట్రోఫీతో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్ యూరోకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది.
🎉🇪🇦 ¡Ojo al ambientazo en Cibeles para recibir a los #C4MPEONES de la #EURO2024!
📹 @ernestoasc_ pic.twitter.com/piTQDDiqKm— MARCA (@marca) July 15, 2024

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
