
విమానంలో తప్పుడు ఫైర్ అలర్ట్‌తో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న విమానం నుంచి కిందికి దూకే క్రమంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్పెయిన్‌లోని పాల్మాడి మాలొర్కా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. మాంచెస్టర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
స్పెయిన్‌లోని పాల్మా డి మయోర్కా విమానాశ్రయంలో ర్యాన్ ఎయిర్ బోయింగ్ 737 విమానంలోఈ గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్‌ల నుంచి బయటకు రాగా.. మరికొందరు విమానం రెక్కలపైకి ఎక్కి నేలపైకి దూకారు. ఇది తప్పుడు ఫైర్ అలర్ట్ అని తేలడంతో విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.
In Spain, the Manchester-bound plane was about to take off.
Fire alert triggered an evacuation, following which the panicked passengers began jumping from the plane's wing to save themselves.
At least 18 people on a Ryanair Boeing 737 aircraft were injured after a fire alert… pic.twitter.com/AYkYPhteJ5— SK Chakraborty (@sanjoychakra) July 5, 2025