breaking news
Manchester Aiport
-
వైరల్ వీడియో.. విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు
విమానంలో తప్పుడు ఫైర్ అలర్ట్‌తో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న విమానం నుంచి కిందికి దూకే క్రమంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్పెయిన్‌లోని పాల్మాడి మాలొర్కా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. మాంచెస్టర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.స్పెయిన్‌లోని పాల్మా డి మయోర్కా విమానాశ్రయంలో ర్యాన్ ఎయిర్ బోయింగ్ 737 విమానంలోఈ గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ల నుంచి బయటకు రాగా.. మరికొందరు విమానం రెక్కలపైకి ఎక్కి నేలపైకి దూకారు. ఇది తప్పుడు ఫైర్ అలర్ట్ అని తేలడంతో విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.In Spain, the Manchester-bound plane was about to take off. Fire alert triggered an evacuation, following which the panicked passengers began jumping from the plane's wing to save themselves. At least 18 people on a Ryanair Boeing 737 aircraft were injured after a fire alert… pic.twitter.com/AYkYPhteJ5— SK Chakraborty (@sanjoychakra) July 5, 2025 -
కువైట్‌లో భారత ప్రయాణికులు ఇక్కట్లు.. 13 గంటలుగా ఆహారం లేక..
కువైట్: భారత ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి మాంచెస్టర్‌కు వెళ్లే భారత ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో దాదాపు 13 గంటలపాటు వారంతా ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. ప్రయాణికులకు ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముంబై నుండి మాంచెస్టర్‌కు వెళ్లున్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఫ్లైట్ అత్యవసరంగా కువైట్‌లో ల్యాండ్ అయింది. దీంతో, ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయియి. తమ విమానం కువైట్‌లో దిగే ముందు యూటర్న్ తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులంతా దాదాపు 13 గంటలుగా విమానాశ్రయంలోనే ఉన్నారు. వారికి ఆహారం, సాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#Breaking l Indian passengers flying from #Mumbai to #Manchester, stuck at #Kuwait airport for 13 hours complain of severe problems including not getting "food or #help"; video on social media shows passengers of Gulf Air arguing with airport authorities.#KuwaitAirport #GulfAir pic.twitter.com/DHpgA26eR1— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) December 1, 2024మరోవైపు.. గల్ఫ్ ఎయిర్‌లోని ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ప్రయాణికులును వేధించారని, యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే ఎయిర్‌పోర్టు సిబ్బంది వసతి కల్పించారని ఆరోపించారు. భారత్, పాకిస్తాన్, ఇతర ఆగ్నేయాసియా దేశ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వారిపై పక్షపాతం చూపిస్తున్నారని, ఎలాంటి వసతులు ఇవ్వలేదని మండిపడుతున్నారు.ఈ సందర్బంగా ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులోనే 13 గంటలకు పైగా సమయం గడిచింది. దాదాపు 60 మంది ప్రయాణికులు ఇక్కడే ఉన్నారు. ఉదయం నుండి ప్రతి మూడు గంటలకు మేము ఇంటికి వెళతామని వారు మాకు చెబుతున్నారు. కానీ, ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం మాకు కూర్చోవడానికి స్థలం ఇవ్వమని మేము వారిని చాలా సార్లు అడిగాము. అందరూ నేలపై కూర్చున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
వసీం అక్రమ్‌కు ఘోర అవమానం
మాంచెస్టర్: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్‌కు మాంచెస్టర్ విమానశ్రయంలో ఘోర అవమానం ఎదురైంది. ఇన్సులిన్ విషయంలో విమానశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని, పబ్లిక్‌లో తనపై గట్టిగా అరిచారని ట్విటర్ వేదికగా అక్రమ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాంచెస్టర్ విమానశ్రయంలో జరిగిన సంఘటనతో తీవ్ర నిరాశ చెందాను. నేను అనేక దేశాలు ఇన్సులిన్ వెంటబెట్టుకునే వెళ్లాను. కానీ ఈ రోజు అదే ఇన్సులిన్‌తో మాంచెస్టర్‌లో ఘోర అవమనానికి ఎదురయ్యాను. దీనికి సంబంధించి అధికారులు నన్ను పబ్లిక్‌లో గట్టిగా ప్రశ్నించారు, నాపై అరిచారు. అధికారుల కారణంగా కోల్డ్ కేస్‌లో ఉండాల్సిన ఇన్సులిన్ చెత్త బుట్టలో పడ్డాయి’అంటూ అక్రమ్ ట్వీట్ చేశాడు. కాగా, వసీం అక్రమ్ ట్వీట్‌కు మాంచెస్టర్ ఎయిర్‌పోర్టు అఫిషియల్స్ స్పందించారు. ‘థ్యాంక్యూ వసీం. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు. దీనిపై విచారిస్తాం. మీరు మాకు డైరెక్ట్‌గా మెసెజ్ చేస్తే.. మరింత సమాచారం తీసుకోగలం’అంటూ ఎయిర్పోర్ట్ అఫిషియల్స్ ఆక్రమ్కు తెలిపారు. ‘త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు. మీకు కాంటాక్ట్‌లో ఉంటాను’అంటూ అక్రమ్ రిట్వీట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అక్రమ్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. టోర్నీ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న అతడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. 104 టెస్టులు, 356 వన్డేలు ఆడినే ఆక్రమ్.. పాక్ సాధించిన అనేక చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. -
విమానంలో టాయిలెట్ డోర్ ఓపెన్ చేయబోయి..
ఇస్తామాబాద్ : విమానాన్ని దూరం నుంచి చూసే వాళ్లు ఎక్కువ కానీ దాంట్లో ప్రయాణించే వారు చాలా తక్కువ. విమానం లోపలి భాగం ఎలా ఉంటుంది.. దాంట్లో ఉన్న సదుపాయాలు ఏంటి.. అనే విషయాలు అందరికి తెలియకపోవచ్చు. తొలిసారి విమాన ప్రయాణం చేసే వారికి కూడా అన్ని విషయాలు తెలియవు. దాని వల్ల కొన్ని సార్లు ప్రయాణికులకూ ఇబ్బందులు కలుగుతాయి. తాజాగా తొలిసారి విమానం ఎక్కిన ఓ పాకిస్తానీ మహిళ చేసిన పని ప్రయాణికుల్లో ఆందోళ కలిగించింది. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వెళ్తున్నపాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం టేకాఫ్ తీసుకోవడానికి రన్ వేపై వేగం అందుకుంటుండగా ఓ మహిళ తన సీట్లోంచి హడావుడిగా లేచి నేరుగా వెళ్లి ఎమర్జెన్సీ డోర్ తీశారు. దీంతె విమానం తలుపు తెరుచుకొని వార్నింగ్ అలారం మోగింది. ముందుజాగ్రత్తగా ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి. ఇక విమానంలో ఉన్న ఇతర ప్రయాణికుల సంగతి చెప్పనక్కర్లేదు. భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక హడలిపోయారు. దాంతో విమానాన్ని సిబ్బంది నిలిపివేసి ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి పంపారు. ఇక, ఆ మహిళను ప్రశ్నించగా, తాను టాయిలెట్ కు వెళ్లాలనుకుని డోర్ తెరిచానని, అది ఎమర్జెన్సీ డోర్ అనుకోలేదని తెలిపారు. ఏదైతేనేమి, ఆ మహిళ చేసిన పనికి పీఐఏ విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. -
8 నెలల తర్వాత దొరికిన 'డీజిల్'
లండన్: ఇంటి నుంచి తప్పిపోయిన ఓ కుక్క ఆచూకీ 8 నెలల తర్వాత దొరికింది. ఇంగ్లండ్ లోని సల్ఫోర్డ్ లో చెందిన ఓ మహిళ పెంపుడు కుక్క డీజిల్ గత ఫిబ్రవరిలో కపిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఎంత వెతికినా డీజిల్ జాడ తెలియలేదు. అయితే గతవారం ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ ఎయిర్ పోర్టలోని టెర్మినల్ లో డీజిల్ ను కనుగొన్నారు పోలీసులు. టెర్మినల్ లో కుక్క ఉండటాన్ని గమనించిన ఎయిర్ పోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కుక్కను వెంబడించి అతికష్టం మీద పట్టుకున్నారు. కుక్కకు ఉన్న మైక్రోచిప్ ఆధారంగా దాని యజమానిని కనుగొన్న పోలీసులు అసలు విషయాన్ని తెలియజేశారు. 'ఎనిమిది నెలల కిందట అంటే గత ఫిబ్రవరిలో గార్డెన్ నుంచి డీజిల్ తప్పిపోయింది. అప్పటి నుంచి దాని ఆచూకీ తెలియలేదు. గతవారం ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ లో డీజిల్ ను కనుగొన్నారు సిబ్బంది. మాంచెస్టర్ విమానాశ్రయానికి 25 కిలో మీటర్ల దూరంలోని సల్ఫోర్డ్ పట్టణం ఉంటుంది. కానీ డీజిల్ ఎయిర్ పోర్టుకు ఎలా వచ్చిందో తెలియదు. డీజిల్ మాకు కనిపించేటప్పటికి పూర్తి ఆరోగ్యంగా ఉంది. మాతో డీజిల్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. వెంటనే మైక్రోచిప్ ఆధారంగా యజమానిని గుర్తించాం. బహుశా ఈ ఎనిమిది నెలలు డీజిల్ హాలిడే లో ఉన్నట్టుంది' అని ఎయిర్ పోర్టు పోలీస్ అధికారి సార్జంట్ స్టీవెన్ జేమ్సన్ తెలిపారు. అయితే అత్యంత సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులోకి కుక్క ఎలా వచ్చింది అనే విషయం తెలియరాలేదు. కాగా 8 నెలల తర్వాత డీజిల్ ను చూసిన యజమాని.. ఆనందంతో కంటతడి పెట్టింది. అదే విధంగా చాలా కాలం తర్వాత యజమానిని చూసిన కుక్క కూడా అంతే అప్యాయంగా మెలిగింది.