వచ్చే ఏడాదిలోగా కేబుల్‌ కార్‌ అందుబాటులోకి

Cable Car Facilities In Telangana Being Explored: Srinivas Goud - Sakshi

పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పర్యాటకుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కల్లా ఆధునాతన కేబుల్‌ కార్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం స్పెయిన్‌ పర్యటనలో భాగంగా కేబుల్‌ కార్‌ను పరిశీలించి అందులో తిరిగారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడు తూ ఎత్తైన కొండలపై కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక భువన గిరి కోట, దుర్గం చెరువు లాంటి అనువైన పర్యాటక ప్రదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అధునాతన కేబుల్‌ కార్‌ను ప్రవేశపెట్టేలా చూస్తున్నామని వివరించారు. పర్యాటక ప్రదేశాలను విదేశీ పర్యాట కులకు పరిచయం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top