
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 39 మంది వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బార్సిలోనా సమీపంలోని మాంట్‌కాడా స్టేషన్ వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఉదయం 8 గంటల సమయంలో స్టేషన్‌లో పార్క్ చేసిన ఉన్న రైలును వెనక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు చాలా నెమ్మదిగా కదులుతుండటం వల్ల ఎవరికి తీవ్ర గాయాలు అవ్వలేదని చెప్పారు. రైలులో నిలబడి ఉన్న వారు ఎక్కువ గాయపడినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. .ఈ ఘటన కారణంగా సదరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు దిశలలో రైలు ట్రాఫిక్ నిలిపివేశారు.
చదవండి: జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్‌లో పడిన అమెరికా