స్పెయిన్‌ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి  | Spanish boy married Konaseema girl | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి 

Jan 5 2024 4:26 AM | Updated on Jan 5 2024 7:11 AM

Spanish boy married Konaseema girl - Sakshi

మలికిపురం: స్పెయిన్‌ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి దిండి రిసార్ట్స్‌­లో ఇరు కుటుంబాల న­డు­మ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్క­టయ్యారు. అంబేడ్క­ర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి స్పెయిన్‌లో ఉ­ద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని, సంజనా మనసులు కలిశాయి. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

బుధవారం అర్ధరాత్రి 3.36 గంటలకు (తెల్లారితే గురువారం) దిండి రిసార్ట్స్‌లో వీరి వివాహం ఇరు కుటుంబాలు, సన్నిహితు­ల సమక్షంలో ఘనంగా జరిగింది. స్పెయిన్‌ నుంచి వరుడు, వరుడి తల్లి­దండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్ర­కారం వివాహ ఘట్టాలను శాస్త్రోక్తం గా జరిపించారు.

పెళ్లికి హాజరైన స్పె­యిన్‌ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వధువు సంజనా కోటేశ్వరి చిన్నాన్న, అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు. ఆయనే స్థానికంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement