ఆహా.. సూపర్‌ పవర్‌ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్‌ వీడియోలు | Sakshi
Sakshi News home page

ఆహా.. సూపర్‌ పవర్‌ భూమ్మీదకొచ్చిందా?.. ఏలియన్ల పనేనా? వైరల్‌ వీడియోలు

Published Sun, May 19 2024 12:02 PM

Spain, Portugal Witness Blu Light Sky Viral: Here's The Real Reason

ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే..  తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్‌, పోర్చుగల్‌ ప్రజలు.  

స్పెయిన్‌, పొరుగు దేశం పొర్చుగల్‌ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ  ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. 

అవి చూసి భూమ్మీదకు సూపర్‌ పవర్‌ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్‌ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్‌ పవర్‌ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది.  

అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్‌లో పడిందని, మరికొందరేమో పిన్‌హెయిరోలో పడిందని చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

 రెండు వారాల కిందటే..  అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement