కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష.. గల్ఫ్‌లో అంతే? | abu dhabi court ordered father of minor to pay compensation | Sakshi
Sakshi News home page

కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష.. గల్ఫ్‌లో అంతే?

Mar 17 2026 2:00 AM | Updated on Mar 17 2026 2:03 AM

 abu dhabi court ordered father of minor to pay compensation

గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న తప్పు చేసినా అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇటీవల ఓ మైనర్ బాలుడు చేసిన తప్పుకు అతని తండ్రికి కోర్టు శిక్ష విధించింది. పిల్లాడి సంరక్షణ బాధ్యత తండ్రిదేనని తెలిపింది.

అబుదాబీలో ఇటీవల ఓ మైనర్ బాలుడు ఒకరి ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న మరో మైనర్ బాలుడి చిత్రాలను వీడియో తీసి అతనిని ఆట పట్టించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో  తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని సదరు కుటుంబం సదరు కుటుంబం ఈ విషయంపై కేసు నమోదు చేసింది. ఈ వివరాలను పరిశీలించిన అక్కడి న్యాయమూర్తి ఇది పిల్లాడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని తీర్పు ఇచ్చారు.

అందుకు గాను సదరు కుటుంబానికి 50 వేల దిర్హామ్‌లు జరిమానా విధించారు. అయితే ఆ పిల్లాడు మైనర్ అని వాదించినప్పటికీ వారి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులేదనని వారి ఎటు వెళుతున్నది ఏం చేస్తున్నది కనిపెడుతూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక ఆ ఫ్యామిలీ ఆ మెుత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement