పాఠశాల సమీపంలో భారీ పేలుడు  | Afghanistan explosion kills 10 students and injures more than 100 | Sakshi
Sakshi News home page

పాఠశాల సమీపంలో భారీ పేలుడు 

Nov 29 2026 6:19 AM | Updated on Nov 29 2026 6:25 AM

Afghanistan explosion kills 10 students and injures more than 100

10 మంది చిన్నారుల మృతి

110 మంది గాయాలపాలు 

అఫ్గాన్‌లోని కునార్‌ ప్రావిన్స్‌లో దుర్ఘటన 

కాబూల్‌: గనుల తవ్వకంలో ఉపయోగించే పేలుడుపదార్థాలను నిల్వచేయడంలో మైనింగ్‌ కంపెనీలు చూపిన తీవ్ర నిర్లక్ష్యం అభంశుభం ఎరుగని పది మంది పాఠశాల విద్యార్థుల ప్రాణలను బలితీసుకుంది. అఫ్గానిస్తాన్‌లోని కునార్‌ ప్రావిన్స్‌లోని అసాదాబాద్‌ నగరంలో పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పాఠశాలకు అత్యంత సమీపంలో పలు మైనింగ్‌కంపెనీల పేలుడుపదార్థాల నిల్వకేంద్రం ఉంది. 

అందులో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది మృతిచెందగా 110 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి పాఠశాలలోని తరగతి గదులు పేకమేడల్లా కూలిపోయాయి. విద్యార్థుల శరీరాలు చిధ్రమై మాంసంముద్దలుగా నలుదిక్కుల్లా పడ్డాయి. డజన్లకొద్దీ చిన్నారులు రక్తమోడుతూ సాయంకోసం అర్థించారు. దీంతో ఆప్రాంతమంతా భీతావహంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement