బాక్సాఫీస్‌ వద్ద ‘మిరాయ్‌’ సునామీ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..? | Mirai Movie Box Office Collection Day 2 Details | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ వద్ద ‘మిరాయ్‌’ సునామీ.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

Sep 14 2025 1:22 PM | Updated on Sep 14 2025 1:26 PM

Mirai Movie Box Office Collection Day 2 Details

మిరాయ్‌..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో గొప్ప సినిమా తీశారంటూ విమర్శకులు సైతం ఈ సినిమాపై​ ‍ప్రశంసలు కురిపిస్తున్నారు.   దీంతో ఈ సినిమా కలెక్షన్స్‌ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తొలి రోజు(సెప్టెంబర్‌ 12) 27.20 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను సాధించింది. మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.60 కోట్ల కలెక్షన్స్‌ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

(చదవండి: మిరాయ్‌ కోసం ప్రభాస్‌ రెమ్యునరేషన్‌? ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఇదే!)

ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. నార్త్‌ అమెరికాలో రెండు రోజుల్లోనే 1 మిలియన్ల డాలర్లను రాబట్టింది. యూఎస్‌, కెనడాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ మూవీకి వచ్చిన హిట్‌ టాక్‌ని బట్టి చూస్తే..వీకెండ్‌లోగా ఈజీగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

(చదవండి: రెండోసారి ప్రసవం.. మానసికంగా దెబ్బతిన్నా: ఇలియానా)

మిరాయ్‌ విషయానికొస్తే.. హనుమాన్‌ తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రమిది. మంచు మనోజ్‌ కీలక పాత్ర పోషించాడు. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కీర్తి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement