
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా 'మిరాయ్'. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో మూవీ మేకింగ్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. 'మిరాయ్' మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
'మిరాయ్' సినిమాతో మనోజ్ తన కెరీర్ లో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ మూవీ ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.