హనుమాన్ హీరో యాక్షన్‌ అడ్వెంచర్‌.. రిలీజ్‌ డేట్‌ ఇదే! | Hanuman Hero Teja Sajja Latest Movie Special Poster Released Today | Sakshi
Sakshi News home page

Teja Sajja: తేజ సజ్జా పాన్ ఇండియా మూవీ.. స్పెషల్ పోస్టర్‌ రిలీజ్‌!

Aug 23 2024 4:49 PM | Updated on Aug 23 2024 6:29 PM

Hanuman Hero Teja Sajja Latest Movie Special Poster Released Today

హనుమాన్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్‌ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. 

ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్‌ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ సినిమాపై  మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌర‌హ‌రి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement