
మిరాయ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జా ప్రధాన కథానాయుకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో రితికానాయక్ హీరోయిన్‌గా నటించగా.. మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి 'జైత్రయా' సాంగ్‌ను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించారు.