breaking news
Sankar mahadevan
-
'మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు'.. మెగాస్టార్ ట్వీట్!
ఇటీవల ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుల్లో శక్తి బ్యాండ్ సత్తాచాటింది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు 2024లో ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. మెగాస్టార్ ప్రశంసలు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వారికి అభినందనలు తెలిపారు. గ్రామీ అవార్డులతో మువ్వన్నెల భారతజెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని అన్నారు. 'గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గెలుచుకున్న అద్భుతమైన శక్తి టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా శంకర్ మహదేవన్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నా కోసం అద్భుతమైన పాటలు పాడారు. మీరు మా అందరికీ గర్వకారణం, మీ అద్భుతమైన విజయాలు కోట్లాది మంది భారతీయులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మెగాస్టార్ ఆకాక్షించారు. The Indian flag 🇮🇳 flies high at the #GRAMMYs Joining the party a bit late, but Hearty Congrats to the amazing Team #Shakti for winning the ‘Global Music Album of the year’! Kudos to Ustad @ZakirHtabla , @Shankar_Live #SelvaGanesh , #GaneshRajagopalan for seizing ‘This… — Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2024 -
షాండ్ ఆర్ట్
సైకత చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తున్న యువ కళాకారుడు బి.హరికృష్ణ నగరంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ నుంచి 2012లో బీఎఫ్ఏ పూర్తి చేశాడు. తన కళా సృజనలో ఎప్పటికప్పుడు సామాజిక పరిణామాలను స్పృశించే హరికృష్ణ, కళ ద్వారా కొంతవరకైనా సామాజిక పరివర్తన జరగాలనేదే తన ఆశయమంటాడు. విభిన్నమైన కళా రూపాన్ని ఎంచుకున్న హరికృష్ణ, వైవిధ్యభరితమైన అంశాలను ఎంపిక చేసుకోవడం విశేషం. తన విలక్షణ ప్రతిభతో హరికృష్ణ భారత విదేశాంగ శాఖ సౌజన్యంతో గూగుల్ ఇండియా నిర్వహించిన ‘యూట్యూబ్ గ్లోబల్ వీడియో చాలెంజ్-2012’ పోటీలో విజేతగా నిలిచాడు. అప్పటి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఐదు నిమిషాల్లోనే భారత్ ఘనతను చాటే వీడియోను రూపొందించడం ఈ పోటీలోని అంశం. ‘నిర్భయ’ సంఘటనపై సైకత చిత్రాలతో రూపొందించిన వీడియోను ఫేస్బుక్లో పెడితే తిలకించిన ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, హరికృష్ణను ‘జీ సరిగమప’ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. హరికృష్ణ వీడియోను ప్రదర్శిస్తూ, శంకర్ మహదేవన్ పాట పాడారు. పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధగల హరికృష్ణ తమ కాలనీ వందకు పైగా మొక్కలను నాటడం, వినాయక చవితి వేడుకల కోసం ఏడడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేశాడు. - సిద్ధాంతి