
తేజ సజ్జా 'మిరాయ్' థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇందులో తేజ, మనోజ్‌తో పాటు హీరోయిన్ రితికా నాయక్ కూడా ఆకట్టుకుంది.

ఈమె గతంలోనూ తెలుగులో 'అశోకవనంలో అర్జున కల్యాణం', 'హాయ్ నాన్న'లో నటించింది.

ఆ రెండు చిత్రాలతో పాటు ఇప్పుడు 'మిరాయ్'తో మరో హిట్ కొట్టేసింది.

రితికా వ్యక్తిగత విషయానికొస్తే.. ఈమెది ఢిల్లీలో స్థిరపడిన ఒడియా కుటుంబం.

1997లో పుట్టింది. చదువుల్లో టాపర్. గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్‌లోకి వచ్చింది.

2019లో ఢిల్లీలో జరిగిన టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 12వ సీజన్‌లో విజేతగా నిలిచింది.

'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో నటించి సైమా అవార్డ్ కూడా అందుకుంది.

'హాయ్ నాన్న' అతిథి పాత్ర పోషించి ఆకట్టుకుంది. అలా 'మిరాయ్'లో ఛాన్స్ అందుకుంది.

ప్రస్తుతం ఈమె చేతిలో డ్యూయెట్, వరుణ్ తేజ్ కొత్త మూవీల ఉన్నాయి.

అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలో కనిపించినా చాలు అని అంటోంది.






