
బాక్సాఫీస్ వద్ద తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మిడ్ రేంజ్ సినిమాలు, టైర్ 2 హీరోల విషయంలో రెండో రోజు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్‌ని మిరాయ్ బద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లలో రూ.8.20 కోట్ల షేర్‌తో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించాడు. టైర్ 2 హీరోలుగా ఉన్న నాని హిట్ 3, శ్యామ్ సింగరాయ్, దసరా.. విజయ్ దేవరకొండ ఖుషి, కింగ్‌డమ్, గీత గోవిందం.. నాగ చైతన్య తండేల్, లవ్ స్టోరీ, మజిలీ లాంటి సినిమాల రికార్డులని ఈ చిత్రం దాటేసింది.
(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ సినిమాలలో హయెస్ట్ షేర్ వచ్చిన సినిమాగానూ టాలీవుడ్ చరిత్రలోనే మిరాయ్ ఘనత సాధించింది. ఈ సినిమాలో తేజ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో తేజ డూప్ లేకుండా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో పాటు కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయిందని ప్రశంసిస్తున్నారు. అన్ని భాషల్లోనూ తేజ పర్ఫామెన్స్‌కు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ దక్కుతున్నాయి.
ఈ దెబ్బతో టైర్ 2 హీరోలలో తేజ సజ్జా.. పైపైకి వచ్చినట్లుగానే ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు రోజుల్లో ఓవరాల్‌గా రూ.55 కోట్ల మేర గ్రాస వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే!)
