
∙రితిక, తేజ, కార్తీక్, మనోజ్, శ్రియ
‘‘మన తెలుగు ప్రేక్షకుల స పోర్ట్ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా సినిమా ఇతర భాషల వారికి నచ్చితే అది బోనస్’’ అని తేజ సజ్జా చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్’. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘మిరాయ్’ కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. చాలా క్లీన్ ఫిలిం. పిల్లలు, కుటుంబమంతా కలిసి చూడొచ్చు’’ అని తెలి పారు. మనోజ్ మంచు మాట్లాడుతూ– ‘‘మిరాయ్’లో నాది బలమైనపాత్ర.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి’’ అని చె ప్పారు. ‘‘మా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కృతీ ప్రసాద్. ‘‘చాలా సిన్సియర్‌గా తీసిన సినిమా ఇది’’ అని కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది ‘మిరాయ్’’ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.