‘మిరాయ్‌’ షూటింగ్‌లో తేజకు గాయాలు, అనారోగ్యం.. హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ | Ritika Nayak Interesting Comments On Teja Sajja, Mirai Movie | Sakshi
Sakshi News home page

‘మిరాయ్‌’ షూటింగ్‌లో తేజకు గాయాలు, అనారోగ్యం.. హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Sep 10 2025 7:39 PM | Updated on Sep 10 2025 7:54 PM

Ritika Nayak Interesting Comments On Teja Sajja, Mirai Movie

‘నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ‘మిరాయ్’  అవకాశం వచ్చింది.  అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది.  వెంటనే ఓకే చెప్పేశాను. ఈ చిత్రంలోని యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని అన్నారు హీరోయిన్‌ రితీకా నాయక్‌. హనుమాన్‌ తర్వాత తేజ సజ్జ నటించిన తాజా మూవీ ‘మిరాయ్‌’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌గా నటించారు. సెప్టెంబర్‌ 12న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్‌గా రితీకా నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. ముఖ్యంగా తేజ చాలా కష్టపడ్డాడు. షూటింగ్‌ సమయంలో ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

మనోజ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్  ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.

కార్తీక్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement