
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్‌యోధగా తేజ కనిపిస్తారు.
తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్‌ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్.