
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో తేజ సజ్జా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సూపర్ యోధాగా ఆయన నటించిన చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రితికా నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో దేశంలోనే టాప్ నిర్మాణ సంస్థలు మిరాయ్ డిస్ట్రిబ్యూట్ హక్కులను పొందాయి.
మిరాయ్ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ బ్యానర్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో హోంబాలే ఫిల్మ్స్, తమిళనాడులో AGS ఎంటర్టైన్మెంట్, మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ వారు మిరాయ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలోనే టాప్‌లో ఉన్న చిత్ర నిర్మాణ సంస్థలు కావడం విశేషం. తెలుగులో మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు విడుదల చేస్తున్నారు.

టాప్ బ్యానర్స్ నుంచి మిరాయ్ సినిమా విడుదల కావడం అనేది ఖచ్చితంగా ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చినట్లు అయింది. దీంతో మిరాయ్ జాతీయ స్థాయిలో తప్పకుండా అద్భుతాలను సృష్టించగలదను అంచనాలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే రూ. 300 కోట్లకు పైగా మార్క్‌ను సులువుగా అందుకోవచ్చిన అంచనాలు ఉన్నాయి.