తేజా సజ్జా 'మిరాయ్'.. వారం లేటుగా థియేటర్లలోకి | Teja Sajja's Mirai Gets New Release Date - Trailer Drops on August 28th | Sakshi
Sakshi News home page

Mirai Movie: హనుమాన్ హీరో కొత్త మూవీ.. రిలీజ్ డేట్ ఇదే

Aug 26 2025 11:46 AM | Updated on Aug 26 2025 12:42 PM

Teja Sajja Mirai Movie Release Date

బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా 'హనుమాన్'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా.. ఇప్పుడు 'మిరాయ్'తో రాబోతున్నాడు. ఇది సూపర్ హీరో తరహా సినిమానే. చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్‌గా సెప్టెంబరు తొలివారం రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందని చెబుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. హిట్‌ సీరియల్‌తో గుర్తింపు)

తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్‌గా చేస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ వారం ఆలస్యంగా అంటే సెప్టెంబరు 12న థియేటర్లలో తీసుకురానున్నట్లు ఇప్పుడు కొత్త పోస్టర్ వదిలారు.

అలానే ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు ముందే పీపుల్స్ మీడియా సంస్థలో తేజా సజ్జా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రీసెంట్‌గానే ఆ ప్రకటన కూడా వచ్చింది. అయితే అది 'జాంబీరెడ్డి' సీక్వెల్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: కన్నడ స్టార్ హీరోకి క్షమాపణ చెప్పిన నటుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement