బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. హిట్‌ సీరియల్‌తో గుర్తింపు | Kannada TV Serial Actress Thanuja Gowda Will Enter Bigg Boss Telugu, Rumours Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. హిట్‌ సీరియల్‌తో గుర్తింపు

Aug 26 2025 9:23 AM | Updated on Aug 26 2025 9:53 AM

Kannada Actress Thanuja Gowda Will Enter Bigg Boss Telugu

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha) దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే రేసు నుంచి కొందరిని ఎలిమినేట్‌ చేశారు. కొందరిని హోల్డ్‌లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్‌ 15లోకి పంపించారు. వీళ్లంతా కామన్‌ ఆడియన్స్‌ విభాగంలో బిగ్‌బాస్‌9లో  ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే, సెలబ్రిటీలు ఎవరు పాల్గొననున్నారు అనే అంశంలో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముద్ద మందారం సీరియల్‌ హీరోయిన్‌ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆమె పేరు ఫైనల్‌ అయిపోయినట్లు సమాచారం.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రతి ఏడాది సీరియల్స్‌లలో గుర్తింపు పొందిన వారిని తీసుకుంటారు. ముఖ్యంగా కన్నడకు చెందిన అమ్మాయిలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని తెలిసిందే. కర్ణాటకకు చెందిన శోభా శెట్టి, యష్మి గౌడ, నిఖిల్  వంటి వారు బాగా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు సీజన్‌-9లోకి 'ముద్ద మందారం' సీరియల్‌లో  పార్వతి పాత్రతో మెప్పించిన 'తనుజా గౌడ' ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయింది. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

కన్నడకు చెందిన తనుజా గౌడ  కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఎక్కువగా సీరియల్స్‌లోనే నటించింది.  దాదాపు 5 సంవత్సరాలు ప్రసారమైన ముద్ద మందారంతో ఆమెకు తెలుగులో పాపులారటీ తెచ్చుకుంది. ఆ తర్వాత నాగ భైరవి సీరియల్‌లోనూ  ఆమె నటించింది. ఆమె గ్లామర్‌తో పాటు మంచి నటనా నైపుణ్యం ఉన్న నటిగా గుర్తింపు పొందింది. బిగ్‌బాస్‌లో ఇప్పటికే కన్నడ అమ్మాయిలు బాగా రాణించారు. దీంతో తనుజా గౌడ కూడా  మెప్పిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement