
కన్నడ యువ నటుడు మను.. స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కి సారీ చెప్పాడు. దాదాపు కాళ్లపై పడినంత పనిచేశాడు. కొన్నిరోజుల క్రితం మనుకు సంబంధించిన ఓ ఆడియో లీకైంది. దీంతో కన్నడ ఇండస్ట్రీ.. ఇతడిపై నిషేధం విధించింది. ఫలితంగానే ఇప్పుడు కాళ్లవేళ్ల పడి బతిమాలడుకున్నాడు. ఇంతకీ ఏంటి విషయం?
కన్నడ చిత్రసీమకు చెందిన మదెనురు మను.. ఈ ఏడాది 'కులదల్లి కీలయావదు' సినిమా చేశాడు. అయితే మే 23న రిలీజ్ అనగా సరిగ్గా ఓ రోజు ముందు ఇతడిపై రేప్ కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని మూవీలో ఇతడితో పాటు పనిచేసిన నటి కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఇతడిని అరెస్ట్ కూడా చేశారు. కొన్నాళ్లకు ఆమె కేసు వాపస్ తీసుకోవడంతో పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్‌తో గుర్తింపు)
మరోవైపు ఇదే నటుడికి సంబంధించిన ఓ ఆడియో లీకైంది. స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, దర్శన్, ధృవ్ సర్జా త్వరలో చనిపోతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సదరు హీరోల ఫ్యాన్స్.. మనుపై ఓ రేంజులో రెచ్చిపోయాడు. ఫలితంగా హీరో దర్శన్‌కి పబ్లిక్‌గా సారీ చెప్పాడు. ఇప్పుడు హీరో శివరాజ్ కుమార్‌ని కలిసి మను.. క్షమాపణ చెప్పుకొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కన్నడలో హీరోగా సినిమాలు చేస్తున్న శివరాజ్ కుమార్.. 2023లో రిలీజైన 'జైలర్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
(ఇదీ చదవండి: అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే: శివ కార్తికేయన్)