
కోలీవుడ్‌లో దళపతి విజయ్(Thalapathy Vijay) పేరు ఒక సంచలనం.. కోట్లాది అభిమానులను సంపాధించుకున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. భవిష్యత్‌లో సినిమాలు చేయనని కూడా తేల్చేశారు. అయితే, కోలీవుడ్ తదుపరి దళపతి ఎవరంటూ కొద్దిరోజులుగా అక్కడి సోషల్‌మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్(Sivakarthikeyan) పేరు తెరపైకి వచ్చింది. ఫ్యూచర్ దళపతి, కుట్టి దళపతి వంటి హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. విజయ్ ఫ్యాన్స్ కూడా మద్ధతు ఇచ్చారు. దీంతో శివ కార్తికేయన్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. విజయ్ ఫ్యాన్స్‌ను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వాటిపై తాజాగా శివ కార్తికేయన్ రియాక్ట్ అయ్యారు.

దళపతి ట్యాగ్‌లైన్‌పై శివ కార్తికేయన్ ఇలా అన్నారు.. 'అన్న (విజయ్) ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విజయ్ లెగసీని కొనసాగించడం చాలా కష్టం. అది అన్నకు మాత్రమే సాధ్యం. మరొకరి ఫ్యాన్స్‌ను గెలవాలని ఏ హీరో అనుకోరు. నేను ఇక్కడ 15 ఏళ్లుగా చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నాను. కొందరి అభిమానాన్ని పొందాను అది చాలు. నాపై వచ్చే విమర్శలకు మీరు (అభిమానులు) స్పందించాల్సిన పనిలేదు. సచిన్, ధోనీ వంటి వారినే కొందరు విమర్శిస్తుంటారు. వారితో పోలిస్తే నేను ఎంత..? ట్రోల్స్‌పై ఎలాంటి ఆవేశాలు వద్దు. సరదాగా, సంతోషంగా నచ్చితే సినిమాలు చూడండి.' అంటూ ఫ్యాన్స్‌కు శివ కార్తికేయన్ సూచించారు. ఆయన నటించిన కొత్త సినిమా మదరాసి సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
విజయ్ నటించిన 'ది గోట్' సినిమాలో శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో ఒక సన్నివేశం ద్వారా విజయ్ తన బాధ్యతను శివకు అప్పగించినట్లు చూపించడంతో, కొంతమంది అభిమానులు శివ కార్తికేయన్ విజయ్ వారసుడిగా భావించడం మొదలుపెట్టారు. కానీ శివ కార్తికేయన్ మాత్రం ‘‘విజయ్ లెగసీ ఆయనదే. దాన్ని ఎవరూ తీసుకోలేరు’’ అని స్పష్టంగా చెప్పారు. విజయ్‌కి శివ కార్తికేయన్ మీద కూడా చాలా గౌరవం ఉంది. ముఖ్యంగా విజయ్, రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుంది. ఇప్పుడు విజయ్ రాజకీయ ఎంట్రీ ఇవ్వడంతో ఆ స్థానాన్ని భర్తి చేసేందుకు వారు శివ కార్తికేయన్ పేరును తెరపైకి తీసుకొచ్చారు.