
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయి మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హనుమాన్ హీరో తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మిరాయ్లో విలన్గా మెప్పించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రసాద్ మల్టీప్లెక్స్లో జరిగిన ఈవెంట్కు మంచు మనోజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ను ఉద్దేశించి మంచు మనోజ్ మాట్లాడారు. మేమిద్దరం గతంలో కలిసి పనిచేద్దామని అనుకున్నామని అన్నారు. ఆమె నా ఫేవరేట్.. చివరికీ ఈ సినిమాలో మా ఇద్దరికీ కుదిరిందన్నారు. అలాగే సినిమాలో జరిగిన సంఘటనలకు సారీ చెప్తున్నా అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఈ మాటలు విన్న శ్రియా వేదికపైనే చిరునవ్వులు చిందించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అంతేకాకుండా మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్పై మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు. కింగ్ ఆఫ్ కంటెంట్ అంటే ఆయనే అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఇండస్ట్రీలో బ్రతకడం చాలా కష్టమని తెలిపారు. జీరో సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చారని.. వంద సినిమాలు తీయాలనే ఆశయంతో అడుగుపెట్టారని కొనియాడారు. ఇలాంటి నిర్మాతను తాను ఎప్పుడు చూడలేదని అన్నారు. మహా మొండి అయితే ఇలా ఉండగలరని ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయని.. ఇక్కడ నిలదొక్కుకోవటం మీలాంటి వారికే సాధ్యమన్నారు మంచు మనోజ్.