
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమాకు ఆయన ఒక బెంచ్ మార్క్ అని అన్నారు. ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజమౌళి అంటే నాకు గౌరవమని కరణ్ జోహార్ వెల్లడించారు. ఒక సినిమాను మరో మూవీతో పోల్చవద్దన్నారు. టాలీవుడ్ మూవీ మిరాయ్ ఈవెంట్కు హాజరైన ఆయన.. దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సార్ ఒక మాస్టర్ అయితే.. మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే శిష్యులమని కరణ్ జోహార్ అన్నారు.
కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో విజువల్ వండర్ మూవీ మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించనుంది.ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.