
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.
మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025
Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼
Nandyal vibe ye veru :) ♥️♥️
Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025