
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్‌కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్‌కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్‌తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐
— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025