
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల కలెక్షన్ కూడా సాధించింది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ సక్సెస్‌ని మంగళవారం రాత్రి విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 'మిరాయ్' టీమ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన నిర్మాత.. హీరో, దర్శకుడికి కార్లు గిఫ్ట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)
సాధారణంగా సినిమాలు హిట్ అయి, మంచి కలెక్షన్స్ సాధిస్తే నిర్మాతలు.. దర్శకుడికో హీరోలకో ఖరీదైన లగ్జరీ కార్లని బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా 'మిరాయ్' హిట్ కావడంతో నిర్మాత విశ్వప్రసాద్ ఆనందపడుతున్నారు. ఈ క్రమంలోనే హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి.. వాళ్లకు నచ్చిన కార్లని గిఫ్ట్‌గా ఇస్తానని స్టేజీపైనే ప్రకటించారు.
'మిరాయ్' విషయానికొస్తే.. 'హనుమాన్' తర్వాత తేజ చేసిన మరో సూపర్ హీరో సినిమా ఇది. తేజ హీరో కాగా మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని.. ఈ చిత్రంతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో గుర్తింపు సాధించారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గౌర హరి ఆకట్టుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)