
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న హీరో తేజ సజ్జా. ప్రస్తుతం యాక్షన్-ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు.
తాజాగా మిరాయ్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు హీరో తేజ సజ్జా ట్వీట్ చేశారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఈ మూవీని ఎంజాయ్ చేయండని పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్, ఎమోషన్, భక్తి ఉండే చిత్రమని రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా మెప్పించనుంది. అంతేకాకుండా శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో రిలీజవుతోంది.
#MIRAI Censored with 𝐔/𝐀 ❤️🔥
A CLEAN FILM for KIDS, FAMILIES and ALL SECTIONS OF AUDIENCE to experience Action, Emotion & Devotion on the big screens💥💥💥
GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🥷
Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/p3zCOrTWK9— Teja Sajja (@tejasajja123) September 8, 2025