సూపర్‌ యోధ పోరాటం | Super Hero Teja Sajja Birthday Special Poster for Mirai Released | Sakshi
Sakshi News home page

సూపర్‌ యోధ పోరాటం

Aug 24 2025 4:30 AM | Updated on Aug 24 2025 4:30 AM

Super Hero Teja Sajja Birthday Special Poster for Mirai Released

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్‌’. రితికా నాయక్‌ హీరోయిన్‌గా, మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (ఆగస్టు 23) తేజ సజ్జా బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘మిరాయ్‌’ సినిమా నుంచి తేజ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కూలిపోతున్న వంతెనపై కేవలం ఒక స్టిక్‌తో నిలబడి ఓ సూపర్‌ యోధాలా హీరో పోరాటం చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది.

‘‘ఈ చిత్రంలో ఓ సూపర్‌ యోధ అవతార్‌లో తేజ కనిపిస్తారు. అతనిపాత్రలో పట్టుదల, ధైర్యం కనిపిస్తాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్, ఫస్ట్‌ వైబ్‌ సాంగ్‌లకు మంచి స్పందన వచ్చింది. అలాగే నార్త్‌లో ‘మిరాయ్‌’ సినిమా హక్కులను కరణ్‌ జోహార్‌ దక్కించుకున్నారు. ఈ సినిమాను 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషల్లో సెప్టెంబరు 5న విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి  సంగీతం: గౌర హరి.  

ఫ్రమ్‌ రాయలసీమ: ‘మిరాయ్‌’ సినిమా తర్వాత తేజ సజ్జా హీరోగా టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ మరో సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రాన్నిపాన్‌–ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. ‘ఫ్రమ్‌ రాయలసీమ టు ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌పై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement