'మిరాయ్‌' విజయం.. మనోజ్‌ తల్లి ఎమోషనల్‌.. వీడియో వైరల్‌ | Manchu Manoj Takes Blessing From His Mother After Mirai Movie Success, Emotional Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

'మిరాయ్‌' విజయం.. మనోజ్‌ తల్లి ఎమోషనల్‌.. వీడియో వైరల్‌

Sep 13 2025 8:00 AM | Updated on Sep 13 2025 9:31 AM

Manchu Manoj Blessing Her Mother For Mirai Movie Success

'మిరాయ్‌' సినిమా మంచు మనోజ్‌ టాలెంట్‌ను బయటకు తెచ్చింది. తన సత్తా ఏంటో ఈ చిత్రంలో చూపించాడు. గతంలో ఆయన నటించిన చాల సినిమాలు ప్రత్యేక గుర్తింపును పొందాయని చెప్పవచ్చు. వేదం, నేను మీకు తెలుసా, ఒక్కడు మిగిలాడు, ప్రయాణం వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని తనలో మంచి నటుడు ఉన్నాడని ప్రేక్షకులకు తెలిపాడు. అయితే, కుటుంబంలో వివాదాలు, తన వ్యక్తిగత కారణాల వల్ల సరైన సినిమాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మిరాయ్‌లో మహావీర్‌ లామా పాత్రలో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే తన అమ్మగారు నిర్మలా దేవి ఆనందంతో ఎమోషనల్‌ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను మనోజ్‌ పోస్ట్‌ చేశారు.

'మిరాయ్‌ విజయం మా అమ్మ అందరికంటే ఎక్కు గర్వంగా ఫీల్‌ అయింది.  దీన్ని సాధ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్న నా ప్రియమైన వారితో ఇలా సంతోషాన్ని పంచుకోవడం మరింత చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ప్రతి సినిమా ప్రేమికుడికి మీరు చూపించే అపారమైన ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.' అని ఆయన తెలిపారు. మిరాయ్‌లో మంచు మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. మనోజ్‌ మాత్రమే చేయగలిగే పాత్ర అనేలా ఉంటుంది. ఈ సినిమా అతనికి మరిన్ని ఛాన్స్‌లు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు.

మంచు కుటుంబంలో వివాదాల తర్వాత వారందరూ మళ్లీ కలిసిపోవాలని అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. మనోజ్‌ సోదరుడు మంచు విష్ణు కూడా మిరాయ్‌ యూనిట్‌ టీమ్‌ కోసం ఒక ట్వీట్‌ చేశారు. దీంతో మంచు కుటుంబం ఒక్కటి కాబోతుందని వారి అభిమానులు సంతోషిస్తున్నా​రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement