
హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం తేజా సజ్జా మరో విజువల్ వండర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరో బ్లాక్బస్టర్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రైలర్లో చివర్లో రాముడి పాత్రను చూపించారు. ఆ రోల్ చేసింది ఎవరనేదానిపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాముడి పాత్రలో ఉన్నది ప్రిన్స్ మహేశ్‌బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సీన్లో ఉన్నది ఎవవనేది మాత్రం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది. రాముడి పాత్రలో ఉన్నది మహేశ్ బాబేనా అని అడిగారు. దానికి ఆయన కాదని తేజ సజ్జా సమాధానమిచ్చాడు. దీంతో రూమర్స్కు చెక్ పడింది. కాగా.. రాముడి పాత్రలో స్టార్ హీరో ఉన్నారని.. ఏఐ సాయంతో ఆ క్యారెక్టర్ రూపొందించారని మొదట రూమర్లు వినిపించాయి. మరి రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం థియేటర్లలో చూడాల్సిందే. కాగా.. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర్లో మెప్పించనున్నారు.