
అన్నమయ్య జిల్లా నందలూరులో బాహుదా నది తీరాన సౌమ్యనాథస్వామి ఆలయం ఉంది. (Sri Sowmyanatha Swamy Temple) ఇది అతి పురాతన ఆలయం. గర్భాలయంలో స్వామివారి విగ్రహం ఏడడుగుల ఎత్తులో ఉంటుంది.

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కొంతకాలం ఇక్కడే ఉండి పలు సంకీర్తనలు రచించినట్లు చరిత్ర చెబుతోంది.

చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా.. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గాలి గోపురం కట్టించాడు. అనంతరం పాండ్య రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు.

సౌమ్యనాథస్వామి ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేనివారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

జులై 5 నుంచి 14 వరకూ తితిదే ఆధ్వర్యంలో సౌమ్యనాథస్వామి వారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనుంది.

నందలూరు ఆలయం కడప నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంటాయి.


















