గోబెక్లీ టెపే గురించి విన్నారా? ఇదొక పురాతన మందిరం.. | Gobekli Tepe: The Details About The World's Oldest Temple | Sakshi
Sakshi News home page

గోబెక్లీ టెపే గురించి విన్నారా? ఇదొక పురాతన మందిరం..

Jun 16 2026 12:41 PM | Updated on Jun 16 2026 12:59 PM

Gobekli Tepe: The Details About The World's Oldest Temple

ఈ ప్రపంచంలో అతి పురాతన గుళ్ల నిర్మాణాల్లో గోబెక్లీ టెపే ఒకటి. ఇది సుమారు క్రీ.పూ 9600-8200 కాలం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా. అంటే దాదాపు 11,500 నుండి 12,000 సంవత్సరాల కాలంనాటిదన్నమాట.

ఈ టెంపుల్‌ టర్కీలోని షాన్లీఉర్ఫా ప్రాంతంలో ఉంది. వ్యవసాయం పూర్తిగా అభివృద్ధి కాకమునుపే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని పరిశోధకులు సూచిస్తున్నారు. గోబెక్లీ టెపే ఆలయాన్ని ప్రపంచంలోనే ఇప్పటివరకు అతి పురాతన నిర్మాణాల్లో ఇది కూడా ఒకటని పరిశోధకులు పరిగణిస్తున్నారు.

గోబెక్లీ టెపే అంటే.. టర్కీభాషలో బొడ్డులాంటి కొండ లేదా పొట్టికొండ అని అర్థం. ఈ ఆలయం స్టోన్‌ ఏజ్‌ చివరి భాగమైన నియోథిక్‌ యుగానికి చెందినదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ నిర్మాణ జరుగుతున్న సమయానికి ఇంకా ప్రజలు వేట, ఆహార సేకరణపైనే ఆధారపడి జీవిస్తున్నారని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా.

ఈ ప్రాంతం 1960లలో గుర్తించబడింది. యునెస్కో ఈ టెంపుల్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 1990లో జర్మన్‌ పురావస్తు శాస్రవేత్త అయిన క్లాస్ ష్మిత్ (Klaus Schmidt) దీని ప్రాముఖ్యతను గురించి చెప్పారు. నేడు ఈ నిర్మాణం సగానికన్నా ఎక్కువ భాగం పూడ్చివేయడం జరిగింది. ఎందుకంటే? దీనిపై ఖచ్చితమైన ఆధారం లేదు. అయితే ఆచారపరమైన లేదా కొత్త నిర్మాణాల కారణం అయిఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఈ టెంపుల్‌ కట్టడంతో.. మానవ నాగరికత, మతం, సమాజం ఎలా ప్రారంభమయ్యాయనే విషయాల గురించి శాస్త్రవేత్తల ఆలోచనలలో కొత్తములపు తిప్పిందని చెప్పవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement