పంట ఆకులను స్కాన్ చేసి తెగుళ్లను ముందే తెలుసుకోవచ్చు
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత నూతన దారులు చూపుతోంది. పంటలకు సోకే తెగుళ్లను ఆరంభ దశలోనే గుర్తించి, సరైన నివారణో΄ాయాలు సూచించేలా హైదరాబాద్‌లోని ‘విఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ పరిశోధకులు ఒక అత్యాధునిక ఏఐ వ్యవస్థకు రూపకల్పన చేశారు.
కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించి ఆకుల తెగుళ్లను గుర్తించే విధా రూపొందించారు. ఈ ఆవిష్కరణను సీఎస్‌ఈ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ్ర΄÷ఫెసర్ డాక్టర్ ఆర్ విజయ సరస్వతి మరో 9 మంది పరిశోధకులతో కలసి రూపొందించిన ఈ సాంకేతికతకు భారత ప్రభుత్వ పేటెంట్ లభించింది. పంటలకు వచ్చే రకరకాల తెగుళ్లను సకాలంలో గుర్తించకపోవటం వల్ల రైతులు ప్రతి సంవత్సరం తీవ్ర దిగుబడి నష్టాన్ని చవిచూస్తున్నారు.
టొమాటో, బంగాళాదుంప, క్యాప్సికమ్ పంటలకు చెందిన 20 వేల ఆకుల చిత్రాల డేటాసెట్‌ను ఉపయోగించి వీఎన్ ఆర్ వీజీఐఈటీ నిపుణులు పరిశోధన చేశారు. పంటల్లో సాధారణంగా కనిపించే ప్రధాన తెగుళ్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఏఐ వ్యవస్థ పంట ఆకుల చిత్రాలను విశ్లేషించి 97.7% కచ్చితత్వంతో ఆరంభ దశలోనే తెగుళ్లను పసిగడుతుంది. అంతేకాకుండా, ఆ తెగులు నివారణకు వాడాల్సిన తగిన క్రిమిసంహారక మందులను కూడా సూచిస్తుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ, పరాగసంపర్కం, మొక్క పెరుగుదల దెబ్బతినక ముందే జాగ్రత్తపడొచ్చని డా. విజయ సరస్వతి తెలి΄ారు.
రైతులకు త్వరలోనే అందుబాటులోకి..!
నేను రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. పంటలను ఆశించే తెగుళ్లను ఆలస్యంగా గుర్తించటం వల్ల ఎకరాలకు ఎకరాలు పంట నాశనమై రైతులు పడే ఆవేదనను దగ్గర్నుంచి చూశాను. ఆ అనుభవమే ఈ పరిశోధనకు పునాది వేసింది. ప్రస్తుతం వెబ్ ఇంటర్‌ఫేస్‌లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. మొబైల్ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నాం. ఇది త్వరలోనే రైతులకు అందుబాటులోకి వచ్చి పంట నష్టాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నాను.
– డాక్టర్ విజయ సరస్వతి, వీఎన్ ఆర్ వీజీఐఈటీ, ప్రధాన పరిశోధకురాలు
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


