రెండెకరాల్లో దేశీ ఆవులతో... నెలకు రూ. 1.4 లక్షల ఆదాయం! | Integrated Indigenous Dairy Farming Model For Small Farmers | Sakshi
Sakshi News home page

రెండెకరాల్లో దేశీ ఆవులతో... నెలకు రూ. 1.4 లక్షల ఆదాయం!

Aug 4 2026 5:14 AM | Updated on Aug 4 2026 5:14 AM

Integrated Indigenous Dairy Farming Model For Small Farmers

హీరామణి గడ్డి చేనులో విజయరామ్‌

దేశీ పాడి ఆవుల పెంపకంలో లాభదాయక నమూనా

మాగాణి భూముల్లో పాడి పరిశ్రమ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశవాళీ పాడి ఆవుల సంతతిని పెంచడంతో పాటు రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయం అందించేందుకు సేవ్‌ స్వచ్ఛంద సంస్థ ఒక ప్రణాళికను అందుబాటులోకి తెచ్చింది.

కేవలం రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా సరైన ప్రణాళికతో సమగ్ర పాడి పరిశ్రమను చేపడితే నెలకు కనీసం రూ. 1,40,000 ఆదాయం పొందవచ్చని సేవ్‌ వ్యవస్థాపకులు మేకపోతుల విజయరామ్‌ వెల్లడించారు. తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు కూడా సమగ్ర పద్ధతిలో దేశవాళీ గోవులను పోషిస్తూ లాభదాయక పాడి వ్యాపారవేత్తలుగా మారటానికి ఈ నమూనా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.  

ఎకరంలో హీరామణి గడ్డి సాగు
ఈ మోడల్‌లో 2 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక రూపొందించారు. ఒక ఎకరంలో పశుగ్రాసం సాగుకు కేటాయించాలి. ఆవులకు అవసరమైన పోషక విలువలు కలిగిన ‘హీరామణి గడ్డి’తో పాటు అధిక ్రపోటీన్‌ ఉండే అవిశ మొక్కలను కూడా కలిపి సాగు చేయాలి. చాప్‌ కట్టర్‌ ద్వారా గడ్డిని ముక్కలుగా కట్‌ చేసి పశువులకు ఆహారంగా అందించాలి.

ఆవులు స్వేచ్ఛగా తిరగాలి
పావెకరంలో ఆవుల రక్షణ, పోషణ కోసం షెడ్డు నిర్మించుకోవాలి. ఎండా కాలమైనా వర్షాకాలమైనా కూడా ఆవులను నిరంతరం కట్టేసి ఉంచకూడదు. అవి ఉల్లాసంగా తిరగటానికి అనువుగా భూమిని ఎత్తు లేపి ఒక పావెకరం మెరక స్థలం ఏర్పాటు చేయాలి. ఎండుగడ్డి/ వరిగడ్డి వాము వేసుకోవటానికి మరో పావెకరం కేటాయించాలి. మిగతా పావెకరం భూమిని కేటాయించి ΄÷లం చుట్టూ వెడల్పాటి గట్లు ఏర్పాటు చేసుకోవాలి. అరటి, మామిడి, కొబ్బరి వంటి పండ్ల చెట్లను పెంచాలి. తద్వారా అదనపు ఫలసాయం పొందే వీలుంది.

పాలు లేదా నెయ్యి...
ఈ విధానంలో 10 దేశవాళీ ఆవులతో పాటు ఒక దేశీ గోజాతి నంది (ఆబోతు)తో పాడి ఫారమ్‌ను ్రపారంభించాలి. ఒక్కో ఆవు రోజుకు సగటున 8 లీటర్ల పాలు (పూటకి 4 లీటర్లు) ఇస్తుంది. ఏడాది ΄÷డవునా 8 ఆవుల ద్వారా రోజుకు కనీసం 60 నుంచి 64 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. దేశీ ఆవు పాలలో ఔషధ గుణాలున్నందున లీటరు రూ. 80కి తగ్గకుండా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఒక వేళ పాలు అమ్మలేకపోతే సంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారు చేసి అమ్ముకున్నా అందుకు తగినంత ఆదాయం వస్తుంది.

ఈ లెక్కన రోజుకు 60 లీటర్ల పాల అమ్మకం ద్వారా రోజుకు రూ. 4,800 సంపాదించవచ్చు. తద్వారా నెలకు ఎంత లేదన్నా రూ. 1.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. తమ దగ్గర శిక్షణ పొంది ఆవు పేడ, మూత్రంతో అనేక ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి విక్రయించుకోవటం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చని విజయరామ్‌ వివరించారు. ‘మచిలీపట్నం సమీపంలోని తరకటూరు, వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం నాగసముందర్‌ దగ్గర గల తమ గోశాలల్లో 15 అడుగుల ఎత్తు హీరామణి గడ్డి సాగులో ఉంది. ఆసక్తిగల రైతులు సందర్శించవచ్చు’ అని విజయరామ్‌ (63091 11427) తెలిపారు.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement