యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు | Huge Devotees Rush At Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు

Jun 8 2025 9:41 AM | Updated on Jun 8 2025 9:41 AM

Huge Devotees Rush At Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple

యాదగిరి గుట్టలో తొలిసారిగా భారీగా దర్శనాలు 

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని శనివారం లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు రాష్ట్రం, దేశం నలుదిశల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి 10.30 గంటల వరకు ధర్మదర్శనం, వీఐపీ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. 

ఒక్క రోజులో లక్ష మంది భక్తులు శ్రీస్వామిని దర్శించుకోవడం ఇదే మొదటి సారని ఆలయాధికారులు చెబుతున్నారు. గత వారం 90 వేల మంది భక్తులు దర్శించుకోగా.. శనివారం రాత్రి 10.30 గంటల తరువాత భక్తులు అధికంగా క్యూలైన్లలో శ్రీస్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం స్వాతి నక్షత్రంతో పాటు సెలవు రోజు కావడంతో.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయాధికారులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement