5వేల ఏళ్ల మిస్టరీ వీడింది.. అశ్వత్థామ బతికే ఉన్నారా? ఆధారాలివే | Proof Of Ashwatthama’s Survival? The 5,000 Year Old Mahabharata Mystery Explained, Watch Full Video Inside | Sakshi
Sakshi News home page

5వేల ఏళ్ల మిస్టరీ వీడింది.. అశ్వత్థామ బతికే ఉన్నారా? ఆధారాలివే

Jul 10 2026 9:33 PM | Updated on Jul 11 2026 11:52 AM

Proof That Ashwatthama From Mahabharata Is Still Alive

చరిత్ర పుటల్లో కొన్ని రహస్యాలు కాలంతో పాటు కలిసిపోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం.. కాలానికి ఎదురునిలిచి, వేల సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి!ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీ ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం! నమ్మశక్యం కాని.. అంతకన్నా ఊహించలేనంత భీతి గొలిపే ఒక సజీవ మిస్టరీ ఇది!

మహాభారత ఘోర యుద్ధం ముగిసి ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ యుద్ధంలో పాల్గొన్న కోట్ల మంది వీరులు, రాజులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ.. సప్త చిరంజీవుల్లో ఒకరైన ఆ ఒక్కడు మాత్రం.. ఇంకా బతికే ఉన్నాడు! అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజం!

నుదిటి నుంచి నిరంతరం రక్తం కారుతూ.. ఒళ్లంతా చీము, గాయాలతో.. ఆకలి దప్పులతో.. చావు కోసం తపిస్తూ.. చావు కన్నా ఘోరమైన నరకాన్ని అనుభవిస్తూ.. అశ్వత్థామ ఇప్పటికీ మన మధ్యే తిరుగుతున్నాడు!.శాపగ్రస్తుడైన ఆ అశ్వత్థామ.. ప్రతిరోజూ తెల్లవారుజామున, మనుషులెవరూ అడుగుపెట్టని ఒక రహస్య శివాలయానికి వస్తాడు.

అక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేసి వెళ్తాడు. తెల్లారి గుడి తలుపులు తీసి చూసేసరికి.. అక్కడ తాజా పూలు, చందనం కనిపిస్తాయి! ఇది కథ కాదు.. ఇప్పటికీ అక్కడ జరుగుతున్న పచ్చి నిజం!అసలు ఆ భయంకరమైన శివాలయం ఎక్కడుంది? అక్కడ అశ్వత్థామను చూసినవారెవరు? ఐదు వేల ఏళ్లుగా ఆ గాయాలతో అతడు ఎలా బతుకుతున్నాడు? ఈ రోజూ మన వీడియోలో.. సైన్స్‌కు సైతం సవాల్ విసురుతున్న ఆ అశ్వత్థామ గుడి మిస్టరీని విప్పబోతున్నాం! వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement