breaking news
yadagirigutta sri lakshmi narasimha swamy
-
యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని శనివారం లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు రాష్ట్రం, దేశం నలుదిశల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి 10.30 గంటల వరకు ధర్మదర్శనం, వీఐపీ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. ఒక్క రోజులో లక్ష మంది భక్తులు శ్రీస్వామిని దర్శించుకోవడం ఇదే మొదటి సారని ఆలయాధికారులు చెబుతున్నారు. గత వారం 90 వేల మంది భక్తులు దర్శించుకోగా.. శనివారం రాత్రి 10.30 గంటల తరువాత భక్తులు అధికంగా క్యూలైన్లలో శ్రీస్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం స్వాతి నక్షత్రంతో పాటు సెలవు రోజు కావడంతో.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయాధికారులు చెబుతున్నారు. -
యాదగిరిగుట్ట క్షేత్రానికి భద్రత ఏది?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీస్వామివారికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇటీవల జరిగిన చింతపండు దొంగతనం వెలుగుచూడటంతో ఆలయ భద్రతలో ఉన్న డొల్లతనం భయట పడింది. కొండపైన కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలింది. యాదగిరి క్షేత్రం అభి వృద్ధి తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర పతి, ప్రధాని వంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ప్రముఖులతోపాటు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ఇటీవల విశ్వం నలుమూ లల నుంచి అందగత్తెలు వచ్చారు. ఇలా ఒకరే మిటి వివిధ స్థాయిల్లోని సెలబ్రిటీలు వస్తు న్నారు. వీరి భద్రత కోసం ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను తీసుకు వచ్చే కంటే స్థానికంగా ఆర్మ్‌డ్‌ఫోర్స్‌ను సిద్ధగా ఉంచాలని గతంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గుర్తించిన గుట్ట క్షేత్రం భద్రతకు ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించారు. దేశ విదేశాల నుంచి వీవీఐ పీలు, వీఐపీలు వచ్చిన ప్రతిసారీ భద్రత కో సం రాచకొండ కమిషనరేట్ నుంచి నలు మూలల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నారు. సిబ్బంది లేరు..యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం బాధ్యతలను చూడటానికి ఏసీపీ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఏసీపీని నియమించినా.. పూర్తిస్థాయి సిబ్బంది లేరు. కొండపైన అప్హిల్ పోలీస్ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట పీఎస్‌తోపాటు మరో పీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటికి స్టేషన్ హౌస్ అధికారులుగా ఇన్స్పెక్టర్లు ఉంటారు. దీంతోపాటు మొత్తంగా ఎస్సైలు ,ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తంగా 300 మంది వరకు అదనంగా సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సాయుధ దళం ఏర్పాటు చేయాలని..బ్రహ్మోత్సవాల సమయంలో వీవీఐపీలు గుట్టకు వచ్చినప్పుడు రక్షణ బాధ్యతలను చూడటానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రిజర్వ్‌పోలీస్, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. 25 మందితో ఆక్టోపస్ పోలీస్ దళం ఉంటుందని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. 30 ఎకరాల స్థలం కేటాయింపు దేవాలయ అభివృద్ధికి కేటాయించిన భూమిలోనే 30 ఎకరాల స్థలం యాదాద్రి ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని చదును చేసి వదిలేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఎలాంటి నిర్మా ణాలూ చేపట్టడం లేదు. ఇందులోనే ప్రధాన కార్యాలయాలు, పరేడ్ గ్రౌండ్, శిక్షణా కేంద్రం క్వార్టర్లు నిర్మించాలి. భద్రతకు ఏదీ ప్రాధాన్యం? ఆలయంతో పాటు భక్తుల భద్ర తకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సీసీ కెమెరాల నిఘాలో శాంతిభద్రతల పర్యవేక్షణ ఉండాలి. వైటీడీఏ (యాదా ద్రి ఆలయ అభివృద్ధి బోర్డు) స్వయంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. వీఐపీల తాకిడి ఎక్కువ గా ఉంటుంది. భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలి. దాని కోసం రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ హెడ్‌క్వార్టర్‌ను యాదగిరి గుట్టలోనే ఏర్పాటు చేయాలి. ఏసీపీ కార్యాలయం, టెంపుల్ సిటీకి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ మంజూరు చేసి వదిలేశారు. -
యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయా న్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కుటుంబసమేతంగా ప్రత్యే క పూజలు నిర్వహించడంతోపాటు కిలో బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కు తీర్చు కోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధి పనులపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో సమీక్షిస్తారు. కేసీఆర్ అక్కడే భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌కు తిరిగి చేరుకోనున్నారు. రేపు వరంగల్‌కు...: సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ వరంగల్‌లో నిర్మించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశముంది. -
యాదాద్రిలో భక్తుల కిటకిట
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. గర్భాలయం, సంగీత భవనం, ఆలయ పరిసరాలు, కొండపైన బస్టాండు తదితర పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దైవ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు..
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బుధవారం సీఎం రానున్న నేపథ్యంలో అధికారులు కొండపై పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఈఓ గీతారెడ్డి మంగళవారం కొండపై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ ఆలయ పరిసరాలను పరీశీలిస్తారని, ఎక్కడ ఎటువంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదని ఆదేశించారు. మంచినీటి ఏర్పాట్లు, సీఎం వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యుత్ నిరంతరాయంగా ఉండాలని ఆమె సూచించారు. సీఎం కారు దిగిన ప్రాంతం నుంచి ఆండాల్ నిలయం వరకు ఎక్కడ, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. స్థానిక సీఐ శంకర్‌గౌడ్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డిలు ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రత్యేక పోలీసు బలగాలను దింపారు. సమావేశంలో ఏఈఓలు చంద్రశేఖర్, కోల అంజనేయులు, దోర్భల భాస్కర శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘గుట్ట’ బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందం గా ముస్తాబు చేశారు. వాహన సేవలను ఆలయ అర్చకులు తిరుమంజనం చేశారు. ఎదుర్కోలు మహోత్సవం, కల్యాణం, దివ్య విమాన రథోత్సవం జరిగే రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. -
యాదగిరికొండపై నిఘానేత్రం
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుండడంతో దేవస్థానంపై విజిలెన్స్ అధికారులు రక్షణ చర్యలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆలయంలో ఎక్కడా అవినీతి చోటుచేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి రహిత పాలన అందిస్తాననడం, ఏ అధికారి లంచమడిగినా తనకు ఫోన్ చేయమని బహిరంగంగా ప్రకటించడం తో ఆలయంలో అవినీతి కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. త్వరలో గుట్ట బ్రహ్మోత్సవాలు ఉండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు అధికారులు వేర్వేరుగా పర్యటిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దర్శనాలకు, కొండపై వచ్చే వాహనాలతో, ఈఓ కార్యాలయంలో అధికారులకు చేయి తడపనిదే పని జరగదంటూ ఆరోపణలు వినిపిస్తుండడంతో విజిలెన్స్ అధికారులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు మఫ్టీలో తిరుగుతూ హోంగార్డులు, ఎస్పీఎఫ్, ఆలయ సిబ్బంది పనితీరు పసిగడుతున్నారని విశ్వసనీయ సమాచారం. దేవస్థానంలో అవినీతి కార్యకలాపాలను కనిపెట్టడమే పని కావడంతో రహస్య తనిఖీలు చేపడుతున్నారు. -
కొండకు కృష్ణాజలాలు
భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలైన మంచినీరు, పారిశుద్ధ్యంపై యంత్రాంగం దృష్టిపెట్టింది. మొదటినుంచి ఇక్కడ మంచినీటి సమస్య ఉంది. దీంతోపాటు కొండపైనా పారిశుద్ధ్యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇదే విషయమై సీఎం కేసీఆర్ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అక్టోబర్ 17న యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో పారిశుద్ధ్యం, పందుల విహారంపై అసహనం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా క్షేత్రం ప విత్రతను కాపాడడానికి అవసరమైన అన్ని చర్య లూ తీసుకోవాలని సీఎం అధికారులను అదేశిం చారు. ఈ క్రమంలోనే సుమారు రూ.750 కోట్లతో పలు సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళిక కోసం కసరత్తు జరుగుతోంది. మంచినీటి ఎద్దడి నివారణ.. నిత్యం వచ్చే భక్తుల అవసరాలను తీర్చడానికి యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం యాదగిరికొండపై మంచినీటి ఎద్దడిని నివారించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం భువనగిరి నుంచి కృష్ణాజలాలు వస్తున్నప్పటికీ అవి రోజూ రావడం లేదు. వారం రోజులకోసారి వస్తుండడంతో అవి ఏమూలకూ సరిపోవడం లేదు. అయితే కృష్ణాజలాలను నేరుగా ఉదయసముద్రం నుంచి యాదగిరిగుట్టకు తీసుకురావడానికి ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశంతో ఆ శాఖ అధికారులు అంచనాలు కూడా ూపొందించారు. నల్లగొండ శివారులోని పానగల్లు ఉదయసముద్రం నుంచి గుట్టకు తీసుకురావాలంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ ఊపులోనే నిధుల మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో గుట్ట అధికారులున్నారు. పారిశుద్ధ్యం ఇలా.. పారిశుద్ధ్య సమస్య దేవస్థానంతోపాటు గుట్టపరిసరాల్లో తీవ్రంగా ఉంది. ప్రధానంగా పందుల స్వైరవిహారం సాగుతోంది. పందులను దూరంగా తరిమివేయడంతోపాటు, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా అనుకున్నట్లు గుట్ట చుట్టూ ప్రహరీ నిర్మించడానికి పెద్దఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం దేవ స్థానం వద్ద అన్ని నిధులు లేనందున కొండచుట్టూ ట్రెంచ్కట్ చేయడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈపని చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేర కు కలెక్టర్ చిరంజీవులు ఉపాధి హామీ పీడీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు కొండపైన పం దులకు ఆహారం దొరకకుండా చేయడానికి పారిశుద్ధ్యం మెరుగుపర్చడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇం దుకోసం అధికారుల బృందంసర్వేలు ప్రారంభించింది. నివేదికలు రూపొందించాం దేవస్థానంలో మంచి నీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న కృష్ణాజలాలు ఏమూలకూ సరిపోవడం లేదు. శాశ్వత మంచినీటి ఎద్దడి నివార ణకు కృషి చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్యం మెరుగుదల, పందులు రాకుండా అడ్డుకోవడానికి ఉపాధి హామీలో ట్రెంచ్కట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దీనిపై ఉపాధి పీడీ గుట్టకు రానున్నారు. - గీతారెడ్డి, ఈఓ, గుట్ట దేవస్థానం